tirupati hotels

tirupati hotels
tirupati holiday packages

Wednesday, September 29, 2010

తితిదేలో కొత్తగా ఆరు డిప్యూటీ పోస్టులు

తితిదేలో ఆరు డిప్యూటీ ఈవో పోస్టులను అదనంగా మంజూరు చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. దేవస్థానంలోనే ఉద్యోగోన్నతిపై పోస్టులు భర్తీకి ప్రక్రియ ముమ్మరంగా నడుస్తోంది. ఈ మేరకు వైకుంఠం-1, 2లకు కలిపి ఓ పోస్టును ఏర్పాటు చేయనున్నారు. ఆహ్వానం విభాగంలో ఇప్పటికే డిప్యూటీ ఈవో(ఆర్‌-1, 2) పోస్టులు ఉండగా ఆర్‌-3 పేరుతో మరొకటి నియామకం జరుగుతుంది. చెన్నై సమాచార కేంద్రం తరహాలో కురుక్షేత్రం, బెంగళూరు, న్యూఢిల్లీలో కేంద్రాలు ఏర్పాటు చేసి డిప్యూటీ ఈవోల నియామకం జరగనుంది. ప్రస్తుతం అనుబంధ ఆలయాలకు డిప్యుటేషన్‌పై డిప్యూటీ ఈవో నియామకం చేస్తున్నారు. ఈ విధానానికి మంగళం పలికి కొత్తగా ఓ పోస్టునే మంజూరు చేయాలనే అభిప్రాయానికి ఉన్నతాధికారులు వచ్చారు. ఈ వ్యవహారం త్వరలోనే కొలిక్కిరానుంది. ఏఈవోలుగా పనిచేస్తున్న అధికారులకు డిప్యూటీ ఈవోలుగా అవకాశం లభిస్తుంది. ఈ నిర్ణయంపై దేవస్థానం అధికారుల్లో హర్షం వ్యక్తమవుతోంది.

Tuesday, September 28, 2010

tirupati photos


మఠం భూములను పరిశీలించిన జేసీ

తిరుపతి అర్బన్, రూరల్ మండలాల్లో ఆక్రమణలకు గురైన హథీరాంజీ మఠం భూములను జాయింట్ కలెక్టర్ పీఎస్.ప్రద్యుమ్న సోమవారం పరిశీలించారు. అర్బన్ మండలంలోని రాస్ బిల్డింగ్ పక్కనున్న స్థలాన్ని, రూరల్ మండలంలోని అవిలాల పంచాయతీ పరిధిలోని సర్వే నంబరు13, 15, 17లలో ఉన్న మఠం భూములను జాయింట్ కలెక్టర్‌తో పాటు తుడా వీసీ పెంచల్‌రెడ్డి, హథీరాంజీ మఠం పీఠాధిపతి అర్జున్‌దాస్ పరిశీలించారు.

ఆక్రమణలకు గురైన ప్రాంతాలకు వెళ్లి అక్కడున్న పరిస్థితులను పరిశీలించారు. పూర్తి సమాచారాన్ని రూరల్ తహసీల్దార్ శివరామిరెడ్డి, సర్వేయర్లు దేవానం ద్, మురళీకృష్ణ, మఠం అధికారి శ్రీనివాసులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ మఠం భూములు ఆక్రమణలకు గురయ్యాయని మఠం యాజమాన్యం ఇటీవల జిల్లా యంత్రాంగానికి ఫిర్యాదు చేసిందన్నారు. హైకోర్టులో ఈ భూములపై రిట్ పిటిషన్ దాఖలైందని పేర్కొన్నారు. కోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించి, మూడేళ్లుగా కొంతమంది భూములను ఆక్రమించుకుని ఇళ్ల నిర్మాణాలు, ఇతరత్రా నిర్మాణాలు చేపట్టారని జేసీ వెల్లడించారు.

అనంతరం మఠం భూములకు సంబంధించిన పూర్తి నివేదికలను తెప్పించుకుని అధికారులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. హథీరాంజీ మఠాధిపతి అర్జున్‌దాస్ మాట్లాడుతూ అవిలాల పంచాయతీ పరిధిలోని మఠం భూములను నరసారెడ్డి అనే వ్యక్తి ఆక్రమించుకుని నిర్మాణాలు చేపట్టాడని చెప్పారు. కోర్టు ఉత్తర్వులను నరసారెడ్డి ఉల్లంఘించారని రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేశామని తెలిపారు. వారి వెంట మఠం మేనేజర్, ఆర్‌ఐ అశోక్‌కుమార్‌పిళ్లై, వీఆర్‌వో విజయబాబు పాల్గొన్నారు.

ప్రత్యేక సమావేశం
హథీరాంజీ మఠం భూముల ఆక్రమణలపై సంయుక్త కలెక్టర్‌ ప్రద్యుమ్న రెవెన్యూ, మఠం అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మఠాధిపతికి పలు సూచనలు చేశారు. మఠం భూములకు సంబంధించి పూర్తి వివరాలు సమర్పించాలని కోరారు. భూముల పరిరక్షణకు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. మరోమారు సమావేశమై భవిష్యత్తులో తీసుకోవాల్సిన చర్యలపై చర్చించనున్నట్లు ఆయన పేర్కొన్నారు


తిరుమలలో చూడదగ్గ ప్రాంతాలు?

1. వరహస్వామి ఆలయం : తిరుమల ఉత్తరమాడ వీధిలో వుంటుంది. మొదట వరహస్వామిని దర్శించి ఆ తర్వాత శ్రీవారిని దర్శించాలని స్థల పురాణం చెపుతోంది.
2. హథీరాం బావాజీ మఠం : శ్రీవారి ఆలయం ఎదురుగా వుంటుంది. దేవదేవుడితో పాచికలు ఆడిన భక్తుడు నడయాడిన స్థలం ఇది.
3. అనంతాళ్వార్ తోట : శ్రీవారికి పుష్పకైంకర్యం చేసే బాగ్యం పొందిన భక్తుడు నివశించిన స్థలం. క్యూకాంప్లెక్స్ వెళ్లే దారిలోనే వుంది.
4. అన్నమయ్య ఇల్లు : వరహస్వామి ఆలయం వెనుక వుంటుంది.
5. తరిగొండ వేంగమాంబ సమాధి: వరహస్వామి అతిథి గృహాల వెనుక వున్న ప్రైవేటు ఇంగ్లీషు మీడియం స్కూలులో వుంది.
6. ఎస్‌వి మ్యూజియం (తిరుమల, తిరుపతి చరిత్రను తెలిపే ఎన్నో అంశాలున్నాయి. రెండు రూపాయల టిక్కెట్టు). ఉచిత దర్శనాల క్యూకాంప్లెక్స్ ఎదురుగా వుంది.
7. నారాయణ గిరి ఉద్యానవనం : పద్మావతి పరిణయం, అన్నమయ్య వర్దంతి వంటి ఉత్సవాలు జరిగే విశాలమైన ఉద్యానవనం. పక్కనే ఆళ్వార్ తీర్థం చెరువు కూడా వుంటుంది. పాపవినాశనం వెళ్లే బస్సు ఎక్కితే: 1. పాపవినాశనం (బస్టాండ్‌ నుంచి 8 కిలోమీటర్లు. బస్సు నేరుగా అక్కడికే పోతుంది) 2. ఆకాశగంగ (బస్టాండ్‌ నుంచి 5 కిలోమీటర్లు) 3. జాపాలి తీర్థం (పాపవినాశనం దారిలో ఉంది. ఆకాశగంగ దిగి కాసేపు నడచి వెళ్లాలి) 4. వేణుగోపాలస్వామిగుడి (బస్టాండ్‌ నుంచి 4 కిలోమీటర్లు) పాపవినాశనం వెళ్లే దారిలో బస్సు దిగి చూసి వచ్చేయవచ్చు. శిలాతోరణం రోడ్డులో వెళితే: 1. శిలాతోరణం (బస్టాండ్‌ నుంచి 3 కిలోమీటర్లు) 2. చక్రతీర్థం ( శిలాతోరణం పక్కనే కాసేపు నడిచి వెళ్లాలి) 3. శ్రీవారి పాదాలు (బస్టాండ్‌ నుంచి 5 కిలోమీటర్లు) 4. వేదపాఠశాల (బస్టాండ్‌ నుంచి 6 కిలోమీటర్లు) (నోట్: ప్రస్తుతం శిలా తోరణంకు ప్రస్తుతం ఆర్టీసీ బస్సులు లేవు. ప్రైవేటు జీపుల్లో వెళ్లాల్సిందే.
www.tirupati4u.com