tirupati hotels

tirupati hotels
tirupati holiday packages

Tuesday, September 28, 2010

మఠం భూములను పరిశీలించిన జేసీ

తిరుపతి అర్బన్, రూరల్ మండలాల్లో ఆక్రమణలకు గురైన హథీరాంజీ మఠం భూములను జాయింట్ కలెక్టర్ పీఎస్.ప్రద్యుమ్న సోమవారం పరిశీలించారు. అర్బన్ మండలంలోని రాస్ బిల్డింగ్ పక్కనున్న స్థలాన్ని, రూరల్ మండలంలోని అవిలాల పంచాయతీ పరిధిలోని సర్వే నంబరు13, 15, 17లలో ఉన్న మఠం భూములను జాయింట్ కలెక్టర్‌తో పాటు తుడా వీసీ పెంచల్‌రెడ్డి, హథీరాంజీ మఠం పీఠాధిపతి అర్జున్‌దాస్ పరిశీలించారు.

ఆక్రమణలకు గురైన ప్రాంతాలకు వెళ్లి అక్కడున్న పరిస్థితులను పరిశీలించారు. పూర్తి సమాచారాన్ని రూరల్ తహసీల్దార్ శివరామిరెడ్డి, సర్వేయర్లు దేవానం ద్, మురళీకృష్ణ, మఠం అధికారి శ్రీనివాసులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ మఠం భూములు ఆక్రమణలకు గురయ్యాయని మఠం యాజమాన్యం ఇటీవల జిల్లా యంత్రాంగానికి ఫిర్యాదు చేసిందన్నారు. హైకోర్టులో ఈ భూములపై రిట్ పిటిషన్ దాఖలైందని పేర్కొన్నారు. కోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించి, మూడేళ్లుగా కొంతమంది భూములను ఆక్రమించుకుని ఇళ్ల నిర్మాణాలు, ఇతరత్రా నిర్మాణాలు చేపట్టారని జేసీ వెల్లడించారు.

అనంతరం మఠం భూములకు సంబంధించిన పూర్తి నివేదికలను తెప్పించుకుని అధికారులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. హథీరాంజీ మఠాధిపతి అర్జున్‌దాస్ మాట్లాడుతూ అవిలాల పంచాయతీ పరిధిలోని మఠం భూములను నరసారెడ్డి అనే వ్యక్తి ఆక్రమించుకుని నిర్మాణాలు చేపట్టాడని చెప్పారు. కోర్టు ఉత్తర్వులను నరసారెడ్డి ఉల్లంఘించారని రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేశామని తెలిపారు. వారి వెంట మఠం మేనేజర్, ఆర్‌ఐ అశోక్‌కుమార్‌పిళ్లై, వీఆర్‌వో విజయబాబు పాల్గొన్నారు.

ప్రత్యేక సమావేశం
హథీరాంజీ మఠం భూముల ఆక్రమణలపై సంయుక్త కలెక్టర్‌ ప్రద్యుమ్న రెవెన్యూ, మఠం అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మఠాధిపతికి పలు సూచనలు చేశారు. మఠం భూములకు సంబంధించి పూర్తి వివరాలు సమర్పించాలని కోరారు. భూముల పరిరక్షణకు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. మరోమారు సమావేశమై భవిష్యత్తులో తీసుకోవాల్సిన చర్యలపై చర్చించనున్నట్లు ఆయన పేర్కొన్నారు


No comments:

Post a Comment